గ్రామాలలో మౌలిక వసతులు : లావణ్య హేమనాథ్ హామీ

గ్రామాలలో మౌలిక వసతులు :  లావణ్య హేమనాథ్ హామీ

హోసూరు : సూలగిరి యూనియన్ లోని అన్ని గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపడతామని యూనియన్ చైర్ పర్సన్ లావణ్య హేమనాథ్ కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. యూనియన్ కార్యాలయంలో నేడు కౌన్సిల్ సమావేశం జరిగింది. అందులో భాగంగా యూనియన్ లోని గ్రామాలలో తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, మురికి కాల్వలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు చైర్ పర్సన్ కు సూచించారు. అనంతరం లావణ్య మాట్లాడుతూ యూనియన్ లోని అన్ని గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపడతామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. దీనిపై క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని లావణ్యా హేమనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూలగిరి యూనియన్ బీడీవోలు విమల్, బాలాజీతో పాటు 20 మందికి పైగా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos