ఎదురు కాల్పుల పై స్వతంత్ర దర్యాప్తు

ఎదురు కాల్పుల పై స్వతంత్ర దర్యాప్తు

న్యూ ఢిల్లీ: ‘దిశ’ నిందితుల్నిఎదురు కాల్పుల పేరిటి పోలీసులు హతం చేయటం గురించి స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అనుకుంటు న్నామని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తెలిపారు. వివాదన్ని పరిష్కరించే దర్యాప్తు అని వార్య మన్నారు. ప్రత్యేక బృందంతో ఎదురు కాల్పుల పై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ము కు ల్ రోహత్గి తెలిపారు. ఎదురు కాల్పులకు పాల్పడిన పోలీసులను క్రిమినల్ కోర్టు ద్వారా విచారించదలిస్తే తాము చేయగ లి గింది ఏమీ ఉండదని బోబ్డే తెలిపారు. ‘ఈ విషయంలో పోలీసులది తప్పు లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలకు తప్పకుండా ఇందు లోని నిజానిజాలు తెలియాలి. ఇందుకు విచారణ తప్పదు. అయితే విచారణకు ఎందుకు ఒప్పుకోవట్లేద’ని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని బోబ్డే ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos