హస్తానికి కొత్త అధినేత రేపు

హస్తానికి కొత్త అధినేత రేపు

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కొత్త అధినేత రానున్నారు. శనివారం ఇక్కడ జరగనున్న పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో అధ్యక్ష ఎన్నిక జరగనుందని పార్టీ వర్గాలు ఇక్కడ వెల్లడించాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ‘శనివారం కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడిని తప్పకుండా ఎన్నుకుంటాం. సారథి ఎంపిక ఇక ఆలస్యమయ్యే అవకాశం లేదు. నాకున్న సమాచారం మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్‌ వచ్చేంత వరకూ చర్చలు జరుగుతాయి. ఆ వెంటనే అంతర్గతంగా ఎన్నిక చేపడతాం’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. శరివారం సమావేశంలో తాత్కాలిక అధినేతను ఎంపిక చేసి నూతన అధ్యక్షుడి ఎంపికకు సమితిని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు కూడా తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆయన ఉత్తరాధికారి నియామకం జరగనందుకు ఆ పార్టీ నేతలూ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎంపిక ఆలస్యమయ్యే కొద్దీ పార్టీకి నష్టం కలుతుతుందని కొందరు బహిరంగంగానే పేర్కొన్నారు. దరిమిలా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ వేగవంతం చేసింది. ప్రియాంక గాంధీని బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో సారథి ఎన్నిక కష్టమవుతోంది. మరో వైపు తాత్కాలిక చీఫ్ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఆమె ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos