ధర్ణా చేసిన కాంగ్రెస్‌ నేతల అరెస్టు

ధర్ణా చేసిన  కాంగ్రెస్‌ నేతల అరెస్టు

హైదరాబాద్: కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయటాన్ని గర్హిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ నేతల్ని పోలీసులు గురు వారం సాయంత్రం అరెస్టు చేసారు. కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని తెరాసాలో విలీనం చేయాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విధాన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి విన్నవించారు. దీన్ని తప్పు బడుతూ తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, నేతలు మల్లురవి, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట ధర్ణా చేసారు. చాలా మంది పోలీసులు అక్కడికి వెళ్లి వారిని నిర్బంధించారు. తర్వాత వారిని బలవంతంగా నెట్టుకుంటూ వాహనాల్లో ఎక్కించి టపాఛబుత్ర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos