ఇమ్రాన్‌ఖాన్‌ మేకపోతు గాంభీర్యం..

ఇమ్రాన్‌ఖాన్‌ మేకపోతు గాంభీర్యం..

ఆర్టికల్‌ 370డీ రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌లో రోజురోజుకు కలవరపాటును రెట్టింపు చేస్తున్నట్లు కనిపిస్తోంది.రెండవసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు ఆర్టికల్‌ 370 డీ రద్దు నిర్ణయం ద్వారా స్పష్టం చేయడంతో పాకిస్థాన్‌ నేతల గుండెల్లో దడ మొదలైంది.దీన్ని కప్పిపుచ్చకోవడానికి విమర్శలు,ఆరోపణలు చేస్తూ ఐక్యరాజ్యసమితి గడప తొక్కుతామని భారత్‌ చర్యకు ధీటుగా సమాధానం చెబుతామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రోజుకో వ్యాఖ్యలు చేస్తూ భయాన్ని హెచ్చరికలు రూపంలో వెళ్లగక్కుతున్నాడు. కాశ్మీరీలను ఎంత అణగదొక్కితే తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు.కాశ్మీర్ పై భారత్ తీసుకొన్న నిర్ణయం భారత్, పాక్ మధ్య సంప్రదాయ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.బీజేపీకి హిందువుల ప్రయోజనాలే ముఖ్యమని ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా చూస్తారని ఇమ్రాన్ విమర్శించాడు.ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో  సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్తామని ఇమ్రాన్ తెలిపాడు.  భారత్  తమపై దాడికి దిగితే తాము ప్రతిఘటిస్తామని అణ్వస్త్ర దేశాల మధ్య యుద్దం జరిగితే విపరీతాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని హెచ్చరించాడు.ఇతర దేశాల మాదిరిగానే భారత్ తో మంచి సంబంధాలను తాను కోరుకొన్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశాడు.ఇమ్రాన్‌ ఖాన్‌ మాటలు చూస్తుంటే భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అయినప్పటికీ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి యుద్ధంపై వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌వ్యాఖ్యలు చూస్తుంటే యుద్ధమంటే మైదానంలో క్రికెట్‌ అనుకుంటున్నాడేమో అనే అనుమానం కలుగుతోంది.క్రికెట్‌లో ఓడితే జయాపజయాలు సహజమని చెప్పి తప్పించుకున్నట్లు యుద్ధంలో కుదరదనే విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ గుర్తుంచుకోవాలి.యుద్ధంలో ఓడితే సహజమని సరిపెట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే యుద్ధంలో ఓడిపోవడమంటే ఒకదేశానికి పూర్తిగా లొంగిపోవడమే.మరి ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ విషయం తెలుసులేదో..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos