భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ అక్కసు..

భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ అక్కసు..

అన్ని రంగాల్లో రోజురోజుకు పాతాళానికి దిగజారుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తానో సమర్థుడినని నిరూపించుకోవడానికి మరోసారి భారత్‌పై అవాకులు చవాకులు పేలాడు.దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇమ్రాన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘1960లో పాకిస్తాన్‌ చాలా అద్భుత దేశం. ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేది. నేను అదే ఆశతో పెరిగాను. కానీ.. దురదృష్టవశాత్తు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. ప్రజాస్వామ్యం గతి తప్పడంతో.. సైన్యం రంగప్రవేశం చేసింది. పాకిస్థాన్‌ పితామహులు తెలివిగా పనిచేశారు. మానవత్వం, సామాజిక న్యాయం కోరుకున్నారు. కానీ.. అది పక్కదారి పట్టింది. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్‌ అభివృద్ధి చెందడం ఖాయం’ అని అభిప్రాయపడ్డారు.ఇక పాకిస్తాన్‌ కన్నా ఏడు రెట్లు పెద్దదైన భారత్‌ను తరచూ ఓడించేవాళ్లమని వ్యాఖ్యానించాడు.హాకీ, ఇతర క్రీడలలో కూడా పాక్‌ ఆధిపత్యం చెలాయించిందని పేర్కొన్నారు. అయితే టీమిండియా చేతిలో చవిచూసిన ఘోర పరాజయాలను మాత్రం చెప్పలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos