వైసీపీ యువనేతపై శ్రీరెడ్డి హట్‌ కామెంట్స్‌..

వైసీపీ యువనేతపై శ్రీరెడ్డి హట్‌ కామెంట్స్‌..

ఎవరూ పట్టించుకోవడం లేదనే అసహనమో లేక ఏం మాట్లాడుతున్నా ఎవరూ ఏమి అనడం లేదనే ధైర్యమో తెలియదు కానీ నటి శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టుల్లో అతి మితిమీరుతోంది.గతంలో శ్రీరెడ్డి నిరసనలు,పోస్టులపై కొద్ది ఆసక్తి చూపిన మీడియా,ప్రజలు సైతం శ్రీరెడ్డి అతి భరించలేక పట్టించుకోవడం మానేయడంతో అందరి దృష్టి తనపై ఉండాలనే కోరికతో హద్దు మీరి పోస్టులు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.ఎప్పుడూ ఏదో ఒక నటుటు,నటి లేదా రాజకీయ పార్టీలు,నేతలపై అసభ్యంగా పోస్టులు చేసే శ్రీరెడ్డి తాజాగా వైసీపీ యువనేత సిద్ధార్థరెడ్డిపై పోస్టు చేసింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా ఫర్వాలేదంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్.. విపరీతంగా వైరలైంది.తొలిసారిగా తన పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నానని కామెంట్ ను పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. నువ్వు మగాడివిరా బుజ్జీ అంటూ సిద్దార్ధ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్కరోజైనా ఆయనకు భార్యగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు. అని తన ప్రేమను వ్యక్తం చేసింది.శ్రీరెడ్డి పోస్టు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కాగా వైసీపీ సామాజిక మాధ్యమాల విభాగం నేతలు,సాధారణ వైసీపీ నేతలు,సిద్ధార్థరెడ్డి అనుచరులు శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు.సిద్ధార్థకు రాజకీయాల్లో చాలా భవిష్యత్తు ఉందని దాన్ని నాశనం చెయ్యొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.కావాలంటే పవన్ కల్యాణ్ ను ట్రై చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.అయితే తమ నాయకుడిపై ప్రేమను వ్యక్తం చేయడాన్ని పలువురు నాయకులు స్వాగతిస్తుండడం గమనార్హం..

If I can b wife to Byreddy sidharth Reddy atleast for 1 day,enough..after that if I die also ok

Posted by Sri Reddy on Saturday, October 12, 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos