ఆ డిమాండ్ సహేతుకమైనదే…

ఆ డిమాండ్ సహేతుకమైనదే…

క్రికెట్‌ ప్రపంచ
కప్‌ లీగ్‌ పోటీల్లో పాకిస్తాన్ తో ఇండియా ఆడకూడదని వినవస్తున్న డిమాండ్లు
సహేతుకమైనవేనని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్ర
దాడి కారణంగా యావత్‌ భారత్‌, పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో
భాగంగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రపంచ కప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్‌ ఆడవద్దనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా ఫర్వాలేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. ఆఫ్‌
స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  ప్రస్తుతానికి క్రికెట్‌పై నేను ఎలాంటి కామెంట్‌ చేయదల్చుకోలేదు. కానీ ఎవరైతే పాక్‌తో ఆడవద్దనే డిమాండ్‌ చేస్తున్నారో అది మాత్రం న్యాయమైన డిమాండే. పరిస్థితులు అంత సాధారణంగా లేవు. అదొక అంతర్జాతీయ టోర్నమెంట్‌. ఐసీసీ, మన భారత క్రికెట్‌ బోర్డు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేనే అయితే పాక్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటాను. ఉగ్ర దాడిపై ఇమ్రాన్‌ ఖాన్‌ కనీసం సంతాపం కూడా తెలియజేయలేదు… అని రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos