అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

న్యూ ఢిల్లీ : అమెరికా ఉత్పత్తులకు భారత్లో చుక్కెదురైంది. సరిహద్దు వివాదం వల్ల చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులను ప్రధాన భారతీయ ఓడ రేవుల్లోని కస్టమ్స్ అధికారులు తిరిగి వెనక్కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, వీటిలో చైనాలో తయారవుతున్న ఆపిల్, డెల్, సిస్కో, ఫోర్డ్ కంపెనీలకు చెందిన అమె రికా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం, అమెరికా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక లోపాయి కారి జట్టు, భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖకు తెలిపింది.. ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లోని విమానాశ్రయాల్లో చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై నూతన పరిశీలనా విధానాన్ని అవలంభిస్తామని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ) ప్రకటించిన అనంతరం ఈ పరిణామాలు జరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos