మిగులు మందుల్నే ఎగుమతి చేయాలి

మిగులు మందుల్నే ఎగుమతి చేయాలి

న్యూ ఢిల్లీ :దేశ అవసరాలకు పోగా మిగిలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సలహా ఇచ్చారు. లు రకాల ఔషధాల ఎగుమతులపై భారత్ కాస్త వెనక్కి తగ్గినందకు రాహుల్ ఈ మేరకు ప్రతిస్పందించారు. ‘స్నేహం అంటే ప్రతీకారం కాదు.. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ అన్ని దేశాలకు సాయం చేయాలి.. అయితే, ప్రాణాలను కాపాడే ఔషధాలను మొదట భారతీయులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాల’ని మంగళవారం ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం చేసిన వినతిని భారత్ నిరాకరించింది. ఇందుకు తాము ప్రతీకారం తీర్చుకుంటామనేలా ట్రంప్ మాట్లాడడంతో భారత్ మనస్సు మార్చుకుంది. పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos