హైదరాబాద్ మహానగరానికి ‘డైనమిక్’ గుర్తింపు..

హైదరాబాద్ మహానగరానికి ‘డైనమిక్’ గుర్తింపు..

వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం తాజాగా మరో అరుదైన గౌరవాన్ని.. గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరును అధిగమించిన భాగ్యనగరం విశిష్ట ఘనత అందుకుంది. 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని స్థిరాస్తి అధ్యయన సంస్థ వెల్లడించింది. పంచవ్యాప్తంగా 130 నగరాలపై జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక విడుదలైంది. మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. జాబితాలోతొలి 20 స్థానాల్లో మన దేశంలోని ఏడు నగరాలు నిలవగా.. హైదరాబాద్ అందులో మొదటి స్థానంలో నిలవటం గమనార్హం. రెండో స్థానంలో బెంగళూరు.. ఐదో స్థానంలో చెన్నై.. పన్నెండో స్థానంలో ఫూణె.. పదహారో స్థానంలో కోల్ కతా.. ఇరవయ్యో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. వరుసగా మూడో ఏడాది హైదరాబాద్ మహానగరం అగ్రస్థానంలో నిలవటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos