ఈ దశాబ్దిలోనే గ్రేట్ ఎస్కేప్..

ఈ దశాబ్దిలోనే గ్రేట్ ఎస్కేప్..

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణాలోని పలు జిల్లాలు ముఖ్యంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది.చరిత్రలో మొదటిసారి మూసి నది పరవళ్లు తొక్కుతుండగా హైదరాబాద్ నగరంలోని 90 శాతం ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.ఈ నేపథ్యంలో నగరంలోని పలు పురాతన భవంతులు కూలడానికి సిద్ధంగా ఉండడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు.ఈ క్రమంలో మొఘల్ పురా ప్రాంతంలో పాత భవనం ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది.ఓ మహిళ నడుస్తూ వస్తుండగా, ఓ పాత భవనం పేకమేడలా కుప్పకూలింది. సరిగ్గా ఆ భవనం వద్దకు మహిళ రాగానే, అది పడిపోయింది.ప్రమాదాన్ని గమనించిన ఆమె, వేగంగా పరుగు పెట్టింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.బాగా పాతబడిపోవటంతో రెండేళ్ల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసేశారు. గడిచిన కొద్దిరోజులుగా భారీ వర్షాలు అదేపనిగా పడుతున్న వేళ.. బలహీనంగా గోడలు.. నీటి చెమ్మకు ఒక్కసారిగా కూలిపోయింది. ఎలాంటి సంకేతాలు లేకుండా.. హటాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామం అక్కడి సీసీ కెమేరాలో నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos