కేసీఆర్‌కు ‘షాక్‌’ ఇవ్వడానికి మరో సమ్మె రెడీ..

కేసీఆర్‌కు ‘షాక్‌’ ఇవ్వడానికి మరో సమ్మె రెడీ..

ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె పోటును ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు మరో సమ్మె పోటు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్‌శాఖ కార్మికులు సమ్మెతో ‘షాక్’ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.తమ పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టీఈటీయుఎఫ్) ఆందోళనకు సిద్ధమవుతోంది.టీఈటీయూఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన వరంగల్ డిస్కమ్ కార్యాలయం వద్ద నిరసన చేయడానికి సిద్ధవుతున్నారు.అనంతరం ఇదేనెల 16వ తేదీన 21 ట్రేడ్ యూనియన్‌లతో కలసి హైదరాబాద్ నగరంలోని సదరన్ డిస్కమ్ ఎదుట నిరసన చేయడానికి సిద్ధమవుతున్నారు.ఉద్యోగాల భర్తీ,కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజ్ తదిరత డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ టీఈటీయూఎఫ్ యూనియన్ ఆరోపిస్తోంది.డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 23వ తేదీన మహాధర్నా చేస్తామని అందుకు అవసరమైతే రాజకీయ పార్టీల మద్దుతు కూడా తీసుకుంటామని టీఈటీయూఎఫ్ చైర్మన్ పద్మారెడ్డి హెచ్చరించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos