రవిప్రకాశ్ అరెస్ట్ దిశగా పోలీసుల అడుగులు..

రవిప్రకాశ్ అరెస్ట్ దిశగా పోలీసుల అడుగులు..

అక్రమాలకు పాల్పడ్డాడంటూ టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి దాదాపుగా నెలరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవిప్రకాశ్‌ పోలీసుల నోటీసులకు స్పందించకుండా,విచారణకు హాజరు కాకుండా తప్పించుకుతిరుగుతూ బెయిల్‌ కోసం హైకోర్టు,సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగిన విషయం కూడా విదితమే.అయితే అన్ని చోట్ల రవిప్రకాశ్‌ చుక్కెదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయాడు. అయితే మూడు రోజులుగా విచారణ చేస్తున్నా రవిప్రకాశ్‌ విచారణకు సహకరించడం లేదని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.దీంతో విచారణకు సహకరించడం లేదనే కారణాన్ని చూపి.. పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.టీవీ 9 సృష్టికర్తను తానేనని… తానెలాంటి తప్పూ చేయలేదని చెబుతూ అసలు విషయాలను మాత్రం బహిర్గతం చేయాలేదని పోలీసుల వాదన. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా నోటీస్ ఇచ్చిన అనంతరం అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.మరోవైపు టీవీ9 లోగో విక్రయానికి సంబంధించిన కేసులో రవిప్రకాశ్‌ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos