మురికినీరు పార్శిల్ ఘటనలో కొత్త ట్విస్ట్..

మురికినీరు పార్శిల్ ఘటనలో కొత్త ట్విస్ట్..

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్‌,మాజీ ఎంపీ కవితతో పాటు ఐఏఎస్‌,ఐపీఎస్‌ తదితర అధికారులకు ప్రముఖులకు పార్శిల్‌లో వచ్చిన మురికినీరు బాటిళ్ల ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది.తన ప్రేమను కాదన్న యువతిపై,ఓ లెక్చరర్‌పై కక్ష తీర్చుకోవడానికి ఓ యువకుడు చేసిన నిర్వాకంగా పోలీసులు గుర్తించారు.కుమ్మెరిగూడ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు కొద్ది కాలంగా సికింద్రాబాద్‌ మార్కెట్‌లో మసాలాల వ్యాపారం చేస్తున్నాడు.కాగా ఓ పదేళ్ల క్రితం బొల్లారంలోని నవభారతి పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న సమయంలో వెంకటేశ్వరరావు ఓ అమ్మాయిని ప్రేమించాడు.అయితే అమ్మాయి మాత్రం ప్రేమను తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నాడు.అనంతరం జరిగిన ఎంబీఏ పరీక్షల్లో తప్పాడు. తాను ఫెయిల్ అవ్వడానికి లెక్చరర్ కారణమని భావించాడు. అతనిపై కూడా పగ  పెంచుకున్నాడు. వీరిద్దరినీ ఇరికించాలని మార్కెట్లోని తన దుకాణంలో గుర్తుతెలియని ద్రావణంతో నిండిన 62 సీసాలను భద్రపరిచాడు. ఆగస్టు 16 తన దుకాణంలో ఉన్న ద్రావణ సీసాలను కాటన్బాక్స్ల్లో నింపి ప్యాట్నీ సెంటర్లో ఉన్న పోస్టాఫీస్ నుంచి ఆగస్టు 17 తిరిగి పోస్టాఫీసుకు వెళ్లాడు. ఫ్రం అడ్రస్వద్ద యువతి పేరు, ఉస్మానియా లెక్చరర్ల పేర్లు, చిరునామాలు రాసి వీఐపీలు, అధికారులకు పార్శిళ్లను రిజిస్టర్పోస్ట్చేశాడు. పోస్టల్చార్జీలు రూ.7216 చెల్లించి, రసీదులు తీసుకున్నాడు. నెల 19 డిస్పాచ్సెక్షన్అధికారులు పార్శిల్బాక్సుల నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించారు. వీటిని పోస్టు చేసిన వ్యక్తి అడ్రస్‌, సమర్పించిన వివరాలు తప్పని గ్రహించారు. వెంటనే మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నిందితుడు పోస్టాఫీ్సకు వచ్చిన ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ను విచారించారుఆటో డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావును గుర్తించి ప్యాట్నీ సెంటర్వద్ద అరెస్ట్చేశారు. అతడి నుంచి ఒకల్యా్పటాప్‌, ఒక ప్రింటర్కమ్స్కానర్‌, ఒక సెల్ఫోన్‌, 8 ప్లాస్టిక్టేపులతోపాటు టీవీఎస్ఎక్సెల్ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos