హొసూరు రైతుకు ఎంత కష్టం..ఎంత నష్టం

హొసూరు రైతుకు ఎంత కష్టం..ఎంత నష్టం

హొసూరు : క్యారెట్ ధరలు పడిపోవడంతో లక్షలు వెచ్చించి పండించిన పంటలను హొసూరు ప్రాంతంలో రైతులు దున్నేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంపలు, బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ క్యాప్సికం తదితర వాణిజ్య పంటలను ఇక్కడి రైతులు పండిస్తూ వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో రవాణా స్తంభించింది. ఈ ప్రభావం  హోసూరు ప్రాంత రైతులపై తీవ్రంగా పడింది. రవాణా నిలిచిపోవడంతో ఇక్కడ పండిస్తున్న కూరగాయలను తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో పంటలను దున్నేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా క్యారెట్ పంటను సాగు చేసిన రైతులు కోతకు వచ్చిన దశలో రవాణా స్తంభించడంతో  కొనేవారు లేక పంటలను దున్నేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని హొసూరు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos