అందరికీ గూడు

అందరికీ గూడు

అమరావతి: రాష్ట్రంలో సొంతిల్లు, ఇంటి స్థలం లేనివారు ఒక్కరూ ఉండరాదని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆశించారు. సోమవారం ఇక్కడ జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు వచ్చే ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు. పట్టాలు ఇవ్వటానికి ముందే ఇంటి స్థలం ఎక్కడుందో లబ్ధిదారులకు చూపించాలని చెప్పారు. దీని కోసం జిల్లా స్థాయిలో పోర్టల్ ను ప్రారంభించాలని ప్రతి అంశాన్ని అందులో పొందు పరచా లన్నారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఇక మీదట ఇకపై ప్రతీ సోమవారం సమస్యల పరిష్కార దినాన్ని నిర్వహించాలని సూచించారు. స్పందన పేరిట ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించి నిర్ధిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని, ఫిర్యాదు స్వీకరణ రశీదు కూడా ఇవ్వాలని ఆదేశించారు. తన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి బాటలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు అందుతున్న సేవలను తాను నేరుగా పరిశీలిస్తానన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లలో నిద్రించాలని సూచించారు. రైతులు, విద్య, వైద్యం రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పునరుద్ఘాటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos