కశ్మీర్‌లో గృహ నిర్బంధం కొనసాగుతుంది…

ఢిల్లీ : కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేదాకా రాజకీయ నాయకుల గృహ నిర్బంధం కొనసాగుతూనే ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తెలిపారు. శనివారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయ నాయకులను ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకున్నామే కానీ వారిపై క్రిమినల్ కేసులు పెట్టలేదని వెల్లడించారు. సభలు, సమావేశాలు లాంటివి నిర్వహిస్తే, ఉగ్రవాదులు వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటారని, అందుకనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాయకులను అదుపులోకి తీసుకున్నామని వివరణ ఇచ్చారు. రాజకీయ నాయకులు కావాలంటే నిర్బంధాలపై కోర్టులో సవాలు చేయవచ్చని సలహా ఇచ్చారు. తాను ఊహించిన దానికంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. లోయలో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్నారు. ఆ దేశం చొరబాట్లను ప్రోత్సహించినంతవరకు ఇక్కడ ఆంక్షలు తప్పవన్నారు. పాకిస్తాన్‌లో మార్పు రానంతవరకూ ఇక్కడా మార్పులు ఉండబోవని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos