బతుకులతో అడుకోకండి

హోసూరు : నాకు కరోనా వైరస్ సోకి హోసూరు ప్రభుతీస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సామాజిక మాధ్యమాలలో అసత్య వార్తలు వైరల్ చేయవద్దని హోసూరు మహిళ జరీనా వేడుకొన్నారు.హోసూరు కాలై కుంట ప్రాంతానికి చెందిన ఆమె వారం రోజులుగా జలుబు చెయ్యడంతో హోసూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. పరీక్షించిన డాక్టర్లు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కరోనా వార్డులో ఉంచి చికిత్స చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె వార్డు నుండి చెప్పాపెట్టక జారుకుందని ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో ఆమె కోసం గాలింపు చేపడుతుండగా ఈ వార్త బయటకు పొక్కింది.  జరీనా ఆస్పత్రి నుండి పరారీ కావడంపై సామాజిక మాధ్యమాలలో  వైరల్ కావడంతో పోలీసులు ఆమెను తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. జెరినాకు రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు కరోనా వ్యాధి సోకలేదని నిర్ధారణ చెయ్యడంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఇరుగు పొరుగు వారు అనుమా నంతో చూడడం భరించలేని జరీనా తనపై సామాజిక మాధ్యమాలలో అసత్యవార్తలు వైరల్ చెయ్యడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని  ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా అసత్యాన్నివైరల్ చేయడం మానుకొని తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos