స్వచ్ఛంద లాక్‌డౌన్‌ యోచనలో హోసూరు వ్యాపారులు

స్వచ్ఛంద లాక్‌డౌన్‌ యోచనలో హోసూరు వ్యాపారులు

హోసూరు : కృష్ణగిరి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 70కి చేరువైంది. కరోనా మహమ్మారి క్రమేపీ విస్తరిస్తుండడంతో  జిల్లాలోని పలు పట్టణాలలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేయడానికి  అంగీకరించారు. జిల్లా కేంద్రం కృష్ణగిరిలో గత రెండుజులుగా సాయంత్రం 3 గంటల తరువాత వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. డెంకణీకోటలో కరోనా ప్రబలడంతో అక్కడా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. బాగలూరులో కూడా 24వ తేదీ నుంచి దుకాణాలను మూసివేయడానికి వ్యాపారుల సంఘం నిర్ణయించింది. హోసూరులో కూడా స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేయడానికి వ్యాపారుల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో దీనిపై లాంఛనంగా ప్రకటన వెలువడుతుందని వ్యాపారులు తెలిపారు. హోసూరు ప్రాంతంలో ప్రబలుతున్న కరోనాను కట్టడి చేయడానికి వ్యాపారులు సైతం ముందుకు రావడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హోసూరు పట్టణంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరవాలని,   తర్వాత మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos