హొసూరు రైతుకు నష్టం మీద నష్టం

హొసూరు రైతుకు నష్టం మీద నష్టం

హొసూరు : హొసూరు ప్రాంతంలో క్యాబేజీ పంటకు గిరాకీ లేకపోవడంతో లక్షలు ఖర్చు చేసి పండించిన పంటలను రైతులు దున్నేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా దేశ వ్యాప్తంగా రవాణా స్తంభించింది. దీంతో హొసూరు ప్రాంతంలో పండించిన పంటలను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి వీలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. హొసూరు ప్రాంతంలో రైతులు క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, బీన్స్, బంగాళదుంపలు తదితర వాణిజ్య పంటలను పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటలను తమిళనాడులోని వివిధ జిల్లాలకే కాక కర్ణాటక, ఆంధ్ర తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. గత నెలన్నర రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో రైతులు  ఇక్కడ పండించిన క్యారెట్, బీట్రూట్, టమాటో తదితర పంటలను కోయకనే తోటలోనే వదిలివేయడంతో మరింత నష్టపోయారు. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా క్యాబేజీని సాగు చేశారు.  దానిని అమ్ముకునే దిక్కు లేక రైతులు క్యాబేజీ తోటలను దున్నేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటలను అమ్ముకునేందుకు కాకపోవడంతో ఈ గతి పట్టిందని  ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos