9 రోజుల్లో చైనా అద్భుతం

9 రోజుల్లో చైనా అద్భుతం

చైనా : చైనా ఉక్కు సంకల్పం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్కు మందు కని పెట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు నిర్వహిస్తూనే, మరో వైపు బాధితుల కోసం అన్ని సదుపాయాలతో భారీ ఆసుపత్రిని నిర్మించింది. 1000 పడకల ఆసుపత్రిని కేవలం 9 రోజు ల్లో నిర్మించటం అద్భుతం.కరోనా వైరస్ బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తే వ్యాధి ఇతరులకు వ్యాప్తిస్తుందని భావించి ప్రత్యేక ఆసు ప త్రిని కరోనా వైరస్కు జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ నగర శివార్లలో కట్టారు. ముందే రూపుదిద్దుకున్న కాంక్రీట్ బ్లాక్స్ ను ఉపయోగించటం వల్ల నిర్మాణ వ్యవధి తగ్గింది. పునాదులపై కాంక్రీట్ బ్లాక్స్ ను అమర్చారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న కాంక్రీట్ బ్లాక్స్ను,నిపుణు లైన ఇంజినీర్లును వుహాన్కు తీసుకువచ్చారు. ఏడు వేల మంది కార్మికులతో పాటు 1000 యంత్రాలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.ఆసు ప త్రికి అవసరమైన నిర్మాణ సరంజామా తరలింపు, మానవ వనరుల తరలింపు బాధ్యతను సైన్యానికి అప్పగించారు. ఆసుపత్రిలో 1000 పడ కలు, 419 వార్డులు, 30 ఐసీయూ లు ఉన్నాయి. 1400 మంది డాక్టర్లను ఇక్కడ నియమించనున్నారు. నేటి నుంచి ఇక్కడ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos