అక్కడ సిగ్నళ్ల వద్ద హారన్లు కొట్టారో కథ ముగిసినట్లే..

అక్కడ సిగ్నళ్ల వద్ద హారన్లు కొట్టారో కథ ముగిసినట్లే..

దేశంలో అత్యంత వాహన రద్దీ ఉన్న నగరాల్లో ఆర్థిక రాజధాని ముంబయి కూడా టాప్‌ 3 జాబితాలో ఉంటుంది.దాదాపు రెండు కోట్లకు ఇంచుమించుగా జనాభా అంతేస్థాయిలో వాహనాలు ఉండడంతో ముంబయిలో ట్రాఫిక్‌ రద్దీ ముంబయి నగరవాసుల నిత్యకృత్యాలు ఒకటిగా మారింది.దీంతో ముంబయిలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు ప్రభుత్వాలు,పోలీసులు తీసుకోని చర్యలు,అనుసరించని మార్గాలు లేవు.ఎన్ని చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది.ఇక సిగ్నళ్ల దగ్గర వాహనదారులు పదేపదే కొట్టే హారన్ల కొడుతూ మరింత చికాకు తెప్పిస్తుంటారు. రెడ్‌ సిగ్నల్‌ పడ్డా గ్రీన్‌ సిగ్నల్‌ పడ్డా అవసరం ఉన్నా లేకపోయినా పదేపదే హారన్లు కొడుతూ శబ్దకాలుష్యానికి కారణమవుతున్నారు.ఈ నేపథ్యంలో  కొన్ని భారీ కూడళ్ల వద్ద డెసిబుల్స్ మెషీన్లతో సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. వీటి ద్వారా వెహికిల్స్ పైన వెళ్లేవారి హారన్ మోతలకు కళ్లెం వేశారు. హారన్ శబ్దాలు డెసిబుల్స్ మీటర్లో 85 కంటే ఎక్కువ నమోదయితే మళ్లీ రెడ్ సిగ్నల్ పడుతుంది. గ్రీన్ సిగ్నల్ పడగానే ఎవరిదారిన వారు సైలెంట్ గా వెళ్లిపోతే మాత్రం ఇబ్బంది లేదు.కానీ హారన్ పైన చెయ్యి పడితే.. మాత్రం గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ.. వెంటనే రెడి సిగ్నల్ లోకి జంప్ అవుతుంది. ప్రమాదకరమైన 85 డెసిబుల్స్ స్థాయి దాటితే సిగ్నల్ టైమర్ రీసెట్ అయి గ్రీన్ నుంచి రెడ్ సిగ్నల్‌కు జంప్ అవుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థను అలా అనుసంధానం చేశారు.చత్రపతి శివాజీ మహారాజా టెర్నినస్మెరైన్ డ్రైవ్పెద్దార్ రోడ్హింద్మాతా సినిమా దబార్బాంద్రా వంటి పెద్ద పెద్ద జంక్షన్ల వద్ద డెసిబుల్ మీటర్స్ను ఇన్ స్టాల్ చేశారు. మేరకు ముంబై పోలీసులు వీడియోను కూడా షేర్ చేశారు.ది పనిషింగ్‌ సిగ్నలింగ్‌ పేరుతో ముంబయి పోలీసులు తీసుకువచ్చిన ఈ కొత్త విధానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేద్దామని ట్వీట్ చేశారు. తెలంగాణ డీజీపీహైదరాబాద్ నగర సీపీజీహెచ్ ఎంసీ కమిషనర్ లను సహకారం అవసరమని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos