వెనక్కు తగ్గిన హాంగ్‌కాంగ్‌

వెనక్కు తగ్గిన హాంగ్‌కాంగ్‌

హాంగ్కాంగ్: వివాదాస్పద నేరగాళ్ల అప్పగింత ముసాయిదాపై హాంకాంగ్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ఆ ముసాయిదాను ఉపసంహ రించి నట్లు బుధ వారం సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ వెల్లడించారు. నేరగాళ్లను అవసరాన్ని బట్టి విచారణ నిమిత్తం చైనాకు అప్పగింతకు ప్రభుత్వం ము సాయిదాను ప్రతిపాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ లక్షల మంది పౌరులు గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దరిమిలా ప్రభుత్వం ముసాయిదాను తాత్కాలికంగా ఆపింది. అయితే దీన్ని పూర్తిగా ఉపసంహరించాలని ప్రజలు మరోసారి చేపట్టిన ఆందో ళన ఉగ్రరూపాన్ని దాల్చడంతో హాంకాంగ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. హాంగ్కాంగ్ వ్యక్తి ఒకరు గర్భవతి అయిన తన ప్రియురాలిని నిరుడు ఫిబ్రవరిలో తైవాన్కు తీసుకెళ్లి అక్కడ ఆమెను హత్య చేసాడు. అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి హాంగ్కాంగ్ వచ్చేశాడు. దీంతో విచారణకు అతణ్ని తమకు అప్పగించాలని తైవాన్ కోరింది. నేరస్తుల అప్పగింత గురించి తైవాన్తో ఒప్పందాలు లేనందున హాంగ్ కాంగ్ అందుకు నిరాకరించింది. నేరస్థుల విష యంలో ఎదుర వుతున్న ఇబ్బందుల దృష్ట్యా హాంగ్కాంగ్ ఈ ముసాయిదాను ప్రతిపా దించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos