దక్షిణాదిలో హిందీ అమలు అసాధ్యం

దక్షిణాదిలో హిందీ అమలు అసాధ్యం

చెన్నై: హిందీ భాష అమలు దక్షిణాదిలో అమలు అసాధ్యమని సినీ నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు.బుధవారంఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. దేశ ప్రజలందరూ కచ్చితంగా హిందీ నేర్చుకుని తీరాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఇచ్చిన పిలుపుతో రజనీ కాంత్ విబేధించారు. ‘హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యమవుతోందేమోగానీ దక్షిణ భారత దేశంలో సాధ్యం కాదు. తమిళులు, దక్షిణాది వాసులు హిందీని అంగీకరించరు. దేశమంతటా ఒకే భాష ఉండటం దేశాభివృద్ధికి మంచిదే కావచ్చు. కానీ, మన దేశంలో ఒకే భాష లేదు కదా. ఉత్తర భారతీ యు లు కూడా ఒకే భాష విధానాన్ని అభినందించరు. కాబట్టి ఒకే భాషను బలవంతంగా రుద్దడం సాధ్యం కాద’న్నారు. ‘జాతీయ వాదం పేరుతో ఒకే మతం-ఒకే భాష తెర పైకి తెచ్చారని, తర్వాత ఏమిట’ని నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు.

తాజా సమాచారం