ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి

ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతి

కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ (టీపీసీసీ) న్యాయ పోరాటం ఫలించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిస్తూ తెలంగాణ హైకోర్టు కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వర్సిటీ వైస్ ఛాన్సెలర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఓయూలో రాహుల్ పర్యటనకు వర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో టీపీసీసీ నేతలు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. టీపీసీసీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి అందుకు నిరాకరించారు. అయినా కూడా తన న్యాయపోరాటాన్ని కొనసాగించిన టీపీసీసీ బుధవారం మరోమారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి మంజూరు చేస్తూ కీలక తీర్పు నిచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos