హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ

హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ

బెంగళూరు :గత ఆదివారం ఇక్కడ జరిగిన రేవ్ పార్టీలోనటి హేమ మాదక ద్రవ్యాల్ని తీసుకున్నట్లు టెస్ట్లో తేలిందని పోలీసులు తెలిపారు. మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇక ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు చేసిన ప్రకటనను హేమ ఖండించారు. తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుదల చేసింది. అయితే ఈ వీడియోయే పోలీసులకు ఆధారంగా మారింది. రేవ్ పార్టీలో ఉన్న వీడియో.. హేమ విడుదల చేసిన వీడియో ఒకేలా ఉండడంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos