ఆ విమానం ఆచూకీ కోసం మోదీ సాయం

ఆ విమానం ఆచూకీ కోసం మోదీ సాయం

హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఏఎన్‌-32 విమానం అదృశ్యమైన నేపథ్యంలో రాడర్ల విషయమై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఒవైసీ ఎద్దేవా చేశారు.‘రాడర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి చాలా బాగా తెలుసు. ఏఎన్‌-32 విమానం ఎక్కడ అదృశ్యమైందో భారత వాయుసేన ఆయన్ను అడిగితే సరి పోతుందని’ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో మీడియాలో చక్కర్లు కొడుతోంది.‘మోదీ ఒక మంచి శాస్త్రవేత్త. రాడార్ల నుంచి తప్పించుకోవడానికి మేఘాలు సాయం చేస్తాయని ఆయన శతృ దేశ భూ భాగంలోకి వాయుసేన యుద్ధ విమానాల్ని పంపిస్తారు. ఇటీవల జూన్‌ 3న 13 మందితో ప్రయాణిస్తున్న వాయుసేన విమానం ఒకటి ఈ విమానం ఆచూకీ చెప్పిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామని వాయుసేన ఆ విమానం ఎక్కడ ఉందో మోదీని ఐఏఎఫ్‌ అడిగితే సరిపోయేది. రూ. 5 లక్షలు ఆదా అయ్యేవి’ అని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos