కర్నాటకలో నాజీ పాలన

కర్నాటకలో నాజీ పాలన

బెంగళూరు : రామాలయ నిర్మాణానికి (అయోధ్య) విరాళాలు ఇవ్వని ఇళ్లకు గుర్తులు పెడుతున్నారని యడియూరప్ప సర్కార్పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ను జర్మనీలోని నాజీ పార్టీతో పోల్చారు. వరుస ట్వీట్లలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు. ‘హిట్లర్ పాలనలో లక్ష లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అనుసరించిన విధానమే ఇప్పుడు కర్నాటకలో అనుసరిస్తున్నారు. రామాలయానికి విరాళాల ఇవ్వని వారి ఇళ్ల పేర్లు మార్కింగ్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదని గుర్తించేందుకే ఈ మార్కింగ్ చేస్తున్నట్టుగా ఉంది. ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ అభిప్రాయాలను మాధ్యమాలూ సమర్ధిస్తూ పోతే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో, సామాన్యుడి పరిస్థితి ఏమి కానుందో కూడా ఊహిం చడం కష్టం. రామమందిర్ సమర్పణ అభియాన్ వాలంటీర్లు విరాళాలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారి ఇళ్ల పేర్లను రాసుకుంటున్నారని అన్నారు. తన కు తెలిసిన సమాచారం ప్రకారం, ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారని, దీనిపై ఇంతవరకూ తనను ఎవరూ సంప్రదించలేదు. అసలు ఇలాంటి మార్కింగ్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. జర్మనీలో నాజీలు ఏం చేశారో ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు అదే చేస్తోంది. జర్మనీలో నాజీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే ఆర్ఎస్ఎస్ పుట్టిందని, ప్రజలు ఎవ్వరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని అప్రకటిత ఎమర్జెన్సీ ప్రస్తుతం దేశంలో ఉంద’ని ఆరోపించారు. ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు ఆర్ఎస్ఎస్ నిరాకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos