హర్యానాలో హస్తానికి ఖాకీ బలం

హర్యానాలో హస్తానికి ఖాకీ బలం

చండీగఢ్ : హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ శనివారం ఇక్కడ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ప్రతి పోలీసూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని తెలిపింది. శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హూడాను హర్యానా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్పాల్ శర్మ సారథ్యంలోని ప్రతినిధి బృందం ఆయన నివాసంలో కలుసుకున్న తర్వాత  ఈ ప్రకటన వెలువడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంజాబ్ పోలీసులతో సమానంగా వేతనాలు కల్పిస్తామంటూ తమకు హుడా భరోసా ఇచ్చారని తెలిపారు. ఇందుకు ప్రతిగా, రాబోయే ఎన్నికల్లో తామంతా కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని పోలీస్ అసోసియేషన్ హామీ ఇచ్చిందని చెప్పారు. 63 వేల మందికి పైగా హర్యానా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు, బంధువులంతా కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని వివరించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos