హరియాణా సంకీర్ణ సర్కారు?

హరియాణా సంకీర్ణ సర్కారు?

చండీగఢ్: హరియాణా శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. భాజపా గెలిచేందుకు స్పష్టమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వేర్వేరు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వాస్తవం ఏమంటే హరియాణాలో సంకీర్ణ సర్కారును ఏర్పాటు అనివార్యం కానుంది. హరియాణాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భాజపా 41, కాంగ్రెస్ కాంగ్రెస్ 29 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. దుశ్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) 11 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. ఇప్పటి వరకూ ఏ పార్టీకీ పూర్తి అధిక్యత లభించ లేదు. తాజా పరిణామాలు దుశ్యంత్ చౌతాలా కింగ్మేకర్గా మార్చే అవకాశాలున్నాయి.ఇప్పటికే భాజపా, కాంగ్రెస్ దుశ్యంత్తో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. మిత్ర పక్షమైన శిరోమణి అకాలీదళ్ నేతలు భాజపా నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అకాలీదళ్ నేతలకు దుశ్యంత్తో మంచి సాన్నిహిత్యం ఉంది. అటు కాంగ్రెస్ కూడా దుశ్యంత్కు ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos