ఒంటెనెక్కిన హర్షుడు

ఒంటెనెక్కిన హర్షుడు

రాజమహేంద్రవరం: పెట్రో ధరలపై ఆగ్రహావేశాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలు దాటిపోయింది. దరిమిలా కాంగ్రెస్ పార్టీ నేత, లోక్సభ మాజీ సభ్యుడు హర్ష కుమార్ పెట్రో ధరల పెరుగుదలపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఇక్కడి తన నివాసం నుంచి రాజీవ్గాంధీ విద్యాసంస్థల వరకు ఒంటైపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్టాడారు. ‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని మళ్లీ కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతార’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos