పాండ్యా, రాహుల్ లకు భారీ జరిమానా..

  • In Sports
  • April 20, 2019
  • 132 Views
పాండ్యా, రాహుల్ లకు భారీ జరిమానా..

కాఫీ విత్ కరణ్ షోలో మహిళలను ఉద్దేశించి
 అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యాతో పాటు రాహుల్ లకు ఒక్కొక్కరికి 20లక్షల జరిమానా విధిస్తున్నట్లు బిసిసిఐ అంబుడ్స్ మెన్ డికె జైన్ వెల్లడించారు. ఈ జరిమానాకు సంబంధించిన వివరాలను బిసిసిఐ అధికారికి వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు జైన్ తెలిపారు.జస్టిస్ జైన్ పాండ్యా, రాహుల్  వ్యవహారంపై మాట్లాడుతూ… వీరిపై ఇవే  చివరి చర్యలని తెలిపారు. ఇక తదుపరి ఈ విషయంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్ఫష్టం చేశారు. ఇప్పటికే వారిద్దరు మహిళలకు క్షమాపణలు కోరినప్పటికి నిషేదానికి గురయ్యారు. ఇప్పుడు మళ్లీ జరిమానా విధించాం. కాబట్టి ఈ వ్యవహరంలో ఇవే చివరి చర్యలని ఆయన వెల్లడించారు. ఇందులో అమరులైన పారామిలిటరీ దళ కానిస్టేబుళ్ల భార్యలకు 10మందికి రూ.1లక్ష చొప్పున చెల్లించాలని, మిగిలిన రూ.10లక్షలు అంధుల క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రచారఖర్చుల నిమిత్తం విరాళంగా ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తాన్ని నిర్దేశించిన నాలుగు వారాల్లోపు చెల్లించాలని, లేకపోతే మ్యాచ్‌ ఫీజుల నుంచి కట్‌ చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధంతరంగా వచ్చేసిన కారణంగా ఇప్పటికే ఈ ఇద్దరూ రూ.30లక్షలు చేజార్చుకున్నారని జైన్‌ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos