కాళ్లు విరిచిన జిమ్నాస్టిక్స్

  • In Sports
  • April 9, 2019
  • 148 Views
కాళ్లు విరిచిన జిమ్నాస్టిక్స్

జిమ్నాస్టిక్స్ అంటేనే ఒళ్లు గగుర్పొడిచే క్రీడ. ఏ మాత్రం అదుపు తప్పినా మొదటికే మోసం వస్తుంది. అమెరికాలోని ఓ జిమ్నాస్ట్‌ అలా అదుపు తప్పి కాళ్లను విరగ్గొట్టుకుని కెరీర్‌కే గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆబర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జిమ్నాస్ట్‌ సమంతా సెరియో గత వారం ఓ ప్రాంతీయ పోటీలో పాల్గొంది. ఫస్ట్‌ పాస్‌ చేస్తూ మ్యాట్‌పై ల్యాండ్‌ అయింది. అయితే అదుపు తప్పి రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పితో ఆమె అల్లాడిపోయింది. అక్కడున్న వారికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. కాసేపటికి వైద్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. ఆమె గుడ్డిగా ఆ ఫీట్‌ చేయడం వల్లే రెండు కాళ్లు విరిగిపోయాయని జిమ్నాస్టిక్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమంత ఆ రోజే తన జిమ్నాస్టిక్స్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos