ముసాయిదాకు వ్యతిరేకంగా 13 పక్షాలు

ముసాయిదాకు వ్యతిరేకంగా 13 పక్షాలు

న్యూఢిల్లీ: రాజ్యసభలో భావసారూప్యం కలిగిన 13 పార్టీలు పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదాను వ్యతిరేకించనున్నాయని ఎగువ సభలో విపక్ష కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు హోం మంత్రి అమిత్ షా ఆ ముసాయిదాను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ‘రాజ్య సభలో భావసారూప్యం కలిగిన 13 పార్టీలు ఉన్నాయి. వారిని స్వయంగా నేను కలిసాను. వారంతా పౌరసత్వ చట్ట సవరణ ముసా యిదాకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నార’ని చెప్పారు. ‘దిగ జారు తున్న దేశ ఆర్థిక పరిస్థితి, చుక్కలనంటుతున్న ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపూ లేదు. కేవలం మత ప్రాతిపదికపై దేశ విభజనపైనే భాజపాకు ఆసక్తి. 370 అధీకరణ రద్దు,ముమ్మారు తలాఖ్, వంటివి ఇందుకు ఉదాహరణలు. రాజ్యాంగంపై భాజపాకు ఏమాత్రం నమ్మకం లేదనే విషయం ఆయా సందర్భాల్లో రుజు వైంద’న్నారు. కాంగ్రెస్కు రాజ్యసభలో 64 మంది సభ్యుల బలం ఉంది. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీఆర్ఎస్, సీపీఎం సహా పలు పార్టీలకు చెందిన 46 మంది బిల్లును వ్యతిరేకంగా ఓటు వేస్తారని, దీంతో బిల్లును వ్యతిరేకించే వారి బలం 110కి పైగా ఉంటుందని కాంగ్రెస్ అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos