కారుకు రూ.10 లక్షల జరిమానా..

కారుకు రూ.10 లక్షల జరిమానా..

ఖరీదైన కారు ఉందని ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే అంతే ఖరీదైన జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది.కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో సవరణలు చేసి జరిమానాలు భారీగా విధిస్తూ కొత్త చట్టం అమలు చేసినా వాహనదారుల్లో మార్పు మాత్రం రావడం లేదు.తాజాగా గుజరాత్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తికి ట్రాఫిక్‌ పోలీసులు రూ.10లక్షల జరిమానా విధించి షాకిచ్చారు. రూ.1.82 కోట్లతో విలాసవంతమైన స్పోర్ట్స్కారు కొనుక్కున్నాడు. సరైన పత్రాలు, నంబర్ప్లేట్లేకుండా తిరుగుతున్నాడు. ట్రాఫిక్ పోలీసులు చలానాలు పంపుతున్నా పట్టించుకోలేదు. చివరకు రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. కారుపై ఉన్న చలానాలు అన్నింటినీ గుర్తించిన పోలీసులు మొత్తం కలిపి దాదాపు రూ.10 లక్షల జరిమానా విధించి, అవి కట్టాకే కారు తీసుకెళ్లమని చెప్పారు. ఘటన గురించి అహ్మదాబాద్పోలీసులు ట్విట్టర్ లో వివరాలు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఆర్టీవో నుంచి మెమో ఇచ్చామని, జరిమానాలు పూర్తిగా చెల్లించాకే కారును ఇస్తామని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos