26న వాణిజ్య బంద్‌

26న వాణిజ్య బంద్‌

న్యూ ఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మార్పును డిమాండ్ చేస్తున్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఈ నెల 26న దేశవ్యాప్తంగా మార్కెట్ల బంద్కు పిలుపునిచ్చింది. దారుణంగా దెబ్బతీస్తున్న జీఎస్టీలోని క్రూరమైన నిబంధనలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. వ్యాపారులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జీఎస్టీ మండలిని కోరింది. 1,500 చోట్ల ధర్నాలు నిర్వహించనున్నట్టు సీఏఐటీ పేర్కొంది. దేశవ్యాప్త బంద్కు అఖిలభారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) మద్దతు ఇచ్చినట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos