వస్త్రాలపై జీఎస్‌టీ పెంపు: వెనక్కుతగ్గిన కేంద్రం

వస్త్రాలపై జీఎస్‌టీ పెంపు: వెనక్కుతగ్గిన కేంద్రం

న్యూ ఢిల్లీ : వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పెంపుపై దేశ వ్యాప్తంగా చేనేత, మర మగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవటంతో జీఎస్టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్టీ పెంపు అమలును ఏకగ్రీవంగా వాయిదా వేసింది. ప్రస్తుతం జౌళి పై ఉన్న జీఎస్టీని ఐదు నుంచి 12 శాతానికి పెంచి జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయిం చారు. శుక్ర వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన 46వ జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2022 ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos