లావణ్యా హేమనాథ్ వితరణ

లావణ్యా హేమనాథ్ వితరణ

హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్ లోని  42 పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నది. లాక్ డౌన్ కారణంగా నిత్యవసర వస్తువులను దాతలు అవసరమైన వారికి అందిస్తున్నారు.అందులో భాగంగా సూలగిరి యూనియన్ చైర్ పర్సన్ లావణ్యా హేమనాథ్ నిత్యవసర వస్తువులను పేదలకు వితరణ చేశారు. సూలగిరి యూనియన్ లోని 42 పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల ను పంపిణీ చేశారు. లావణ్యా హేమనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కెపి.మునిస్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పారిశుధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులను అందజేశారు. తరువాత కెపి.మునిస్వామి మాట్లాడుతు కార్మికులందరు మాస్కులు ధరించడమే కాక తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంకె పార్టీ జిల్లా కౌన్సిలర్ వెంకటాచలపతి, ఎడిఎంకె పార్టీ నాయకుడు రామచంద్రప్ప,సూలగిరి బిడివోలు బాలాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos