నిలబడిన గ్రిడ్

నిలబడిన గ్రిడ్

న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆదివారం రాత్రి విద్యుత్ దీపాలు ఆర్పి వేసినా విద్యుత్ గ్రిడ్ కుప్పకూల లేదు. సుకున్న ముందు జాగ్రత్తలు ఫలించాయి. వీధి దీపాలు, ళ్లలోని ఫ్యాన్ లు, ఏసీ మెషీన్లను ఆన్ లోనే ఉంచడం ఇందుకు కారణం. లాక్ డౌన్ తరువాత 117 గిగావాట్ల విద్యుత్ డిమాండు.అది నిన్న రాత్రి 9 గంటలకు 27 శాతం తగ్గి 85 గిగావాట్లకు పడిపోయింది. ఉత్తరాది రీజియన్ గ్రిడ్ పై నిఘా ఉంచిన గ్రిడ్ ఆపరేటింగ్ సంస్థలు పొసోకో, పవర్ గ్రిడ్, ముందు జాగ్రత్త చర్యగా 50 హెర్జ్ ఫ్రీక్వెన్సీని కొనసాగించారు. దీంతో గ్రిడ్ స్థిరత్వం కొనసాగింది. రాత్రి 9.10 గంటల నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతున్న వేళ కూడా అంతే అప్రమత్తతో ఉన్నారు. డిమాండ్ 110 గిగావాట్లకు చేరేంత వరకూ గ్రిడ్ వ్యవస్థను కనిపెట్టుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos