‘చిల్ డొనాల్డ్​, చిల్’

‘చిల్ డొనాల్డ్​, చిల్’

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 17 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థన్బెర్గ్ మధ్య మళ్లీ ట్వీట్ల రగడ మొదలైంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలక గందరగోళంలో ఉన్న ట్రంప్ ను ఎద్దేవా చేసింది. వేసింది అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్.. ‘లెక్కింపు ఆపండి’ అంటూ గురువారం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన థన్బెర్గ్ గురువారం ఆయన ట్వీట్తోనే వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ‘ఇది హాస్యా స్పదం. ట్రంప్ తన కోపాన్ని నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. వీలైతే తన స్నేహితుడితో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లాలి! చిల్ డొనాల్డ్, చిల్’ అని హేళన చేసింది.ప్రముఖ టైమ్స్ పత్రిక ‘పర్సన్ ఆప్ ద ఇయర్ 2019’గా గ్రెటా థెన్బెర్గ్ ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ఉంచినట్లు ప్రకటించింది. అందరూ ఆమెను ప్రశంసించారు. ట్రంప్ మాత్రం వెటకారంగా మాట్లాడారు. అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆగ్రహంతో ఉన్న డొనాల్డ్కు.. ఆనాడు తనకు ఇచ్చిన సలహానే సూచించి చురక అంటించింది. .వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల పాలకులు నూతన విధానాలు రూపొందించాలని ‘గ్లోబల్ యూత్ మూమెంట్’ పేరుతో ఏడాది కాలంగా థన్బెర్గ్ పోరాటం చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos