దిశా రవి కి గ్రెటా ధెన్బర్గ్ బాసట

దిశా రవి కి  గ్రెటా ధెన్బర్గ్ బాసట

న్యూఢిల్లీ : టూల్కిట్ను ఎడిట్ చేశారని ఆరోపిస్తూ.. పోలీసులు అరెస్ట్ చేసిన యువ పర్యావరణ కార్యకర్త దిశా రవి (22) అరెస్ట్ పై స్వీడన్ పర్యావరణ కార్యకర్త, ‘ప్రైడేస్ ఫర్ ఫ్యూచర్ (ఎఫ్ఎఫ్ఎఫ్)’ రూపకర్త గ్రెటా ధెన్బర్గ్ స్పందించారు. ”భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత నిరసనలు, సమావేశమయ్యే హక్కు అనేవి మానవహక్కులు.. వీటిపై చర్చే అవసరంలేదని, ఇవి ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రాథమిక భాగం అయి ఉండాలి. స్టాండ్ విత్ దిశా రవి” అంటూ దిశా రవి అరెస్ట్పై ఎఫ్ఎఫ్ఎఫ్లో ట్వీట్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్నవారికి మద్దతుగా శాంతియుత గళాన్ని వినిపించాలని అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని ట్వీట్ చేశారు. బారత్లో పర్యావరణ ఆందోళనలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా , ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో కీలకంగా పోరాడుతున్న, అట్టడుగు వర్గాల సమానత్వం, ప్రాతినిధ్యం కోసం కృషి చేసిందని అని ఎఫ్ఎఫ్ఎఫ్ ట్వీట్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos