రూ.18,000 కోట్లు ధరావత్తు చేసి విదేశాలకు వెళ్లండి

రూ.18,000 కోట్లు ధరావత్తు చేసి విదేశాలకు వెళ్లండి

న్యూ ఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ విదేశయానానికి మంగళవారం ఇక్కడి న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.‘ ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేము. ఒక వేళ దేశం విడిచి వెళ్లాలంటే రూ.18,000 కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాల’ని గోయల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి సురేశ్ కెయిత్ కోరారు.తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును సవాలు చేస్తూ గోయల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందించింది. దీనిపై సమాధానం కేంద్రాన్ని ఆదేశించింది. దుబాయ్కు వెళుతున్న గోయల్ను గత మే 25న విమానం నుంచి కిందకు దింపివేశారు. దాంతో తన కు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును న్యాయస్థానంలో సవాలు చేసారు. అయితే ఆయనపై ఇంత వరకు ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేయలేదు. విమానం నుంచి దింపివేసిన తరవాతే తన మీద జారీ అయిన లుక్ అవుట్ నోటీసు గురించి తెలిసిందని గోయల్ వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos