రోడ్లు క్లీన్‌గా ఉండాలంటే వాళ్లు రోజూ రావాలేమో!

రోడ్లు క్లీన్‌గా ఉండాలంటే వాళ్లు రోజూ రావాలేమో!

దేశంలో ఏ ప్రాంతంలో రోడ్లు చూసినా ఏళ్ల తరబడి గతుకులు,పెద్దపెద్ద గుంతలు,దుమ్ముధూళి,రోడ్డు పక్కనే చెత్త ఇదే పరిస్థితి కనిపిస్తుంది.అయితే ఏదైనా ప్రాంతాలకు ముఖ్యమంత్రులు,ప్రధాన మంత్రి,రాష్ట్రపతి లేదా ఇతర దేశాల అధ్యక్షులు,ప్రధానులు వస్తున్నారంటే మాత్రం రోడ్లు అద్దంలా తళతళా మెరిసిపోతాయి.స్వచ్ఛదనానికి మారుపేరులా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి.అయితే అది ఆ ప్రాంతంలో ఆయా ప్రముఖులు ఉన్నంత సేపు మాత్రమే.వాళ్లు అలా వెళ్లిపోగానే రోడ్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది.ఈ ఉపోద్ఘాతం ఎందుకుంటే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాక సందర్భంగా ఆయన రాకపోకలు సాగించే గిండీ మార్గాన్ని అద్దంలా తీర్చిదిద్దింది తమిళనాడు ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-జిన్ పింగ్ భేటీకి వేదికగా మారిన మామళ్లాపురాన్ని స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ లా తయారు చేసింది. ప్రభుత్వ వైఖరి చివరికి మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న మొన్నటి దాకా దుమ్ముధూళితో, చిరిగిపోయిన బ్యానర్లతో కనిపించే మామళ్లాపురం రోడ్లు ఇంత అందంగా తయారు కావడంపై హైకోర్టు న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఛలోక్తులు,విమర్శలు గుప్పించారు.నాయకులు వస్తేనే క్లీన్ చేస్తారా?, క్లీన్ గా ఉండాలంటే ఆ స్థాయి నాయకులు రోజూ వస్తేనే బెటరేమో.. అంటూ ఛలోక్తులు విసిరారు న్యాయమూర్తులు. చెన్నై నగర వ్యాప్తంగా ఇష్టానుసారంగా కట్టిన బ్యానర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని దాఖలైన విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గురువారం వాదోపవాదాలను చేపట్టింది. మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు ఎస్ వైద్యనాథన్, సీ శరవణన్ ఈ పిటీషన్ ఇరు పక్షాల వాదనలను ఆలకించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos