గొటబాయపై 63 పేజీల భారీ ఫిర్యాదు

గొటబాయపై 63 పేజీల భారీ ఫిర్యాదు

సింగపూర్ : ప్రాణ భయంతో శ్రీలంక నుంచ సింగపైపూర్కు పారి పోయిన లంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అక్కడా మన శ్శాంతి కరువైంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్ (ఐటీజేపీ) అనే పౌర హక్కుల సంఘం ఆయనకు వ్యతిరేకంగా సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేసింది. 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం సంభవించినపుడు రక్షణ మంత్రిగా ఉన్న గొటబాయ తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని 63 పేజీల భారీ ఫిర్యాదు చేసింది. అంతర్యుద్ధంలో ఉరితీతలు, అత్యాచారాలు, నిర్బంధాలు, మానసిక వేధింపులు, దాడులు వంటి హేయమైన చర్యలు జరిగాయని వివరించింది. ఇవన్నీ జెనీవా ఒప్పందాలకు విరుద్ధమని, గొటబాయ అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను అతిక్రమించారని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా వివరించారు. గొటబాయ సైన్యంలో కమాండర్ గా ఉన్నపుడూ 700 మంది ఆచూకీ లేకుండా పోయారని, రక్షణ మంత్రి అయ్యాక నేరాలు మరింత పెరిగాయని ఫిర్యాదులో వెల్లడించింది. అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి ప్రజలపై దాడులకు పురిగొల్పేవారని పేర్కొంది. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం ఇలాంటి అనేక అంశాలతో ముడిపడి ఉందని, ఇవన్నీ తీవ్రమైన అంతర్జాతీయ నేరాలు అయినందున గొటబాయను అరెస్ట్ చేసి నేరాలపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos