అర్నాబ్‌ గోస్వామిపై కేసు

అర్నాబ్‌ గోస్వామిపై కేసు

ముంబై : ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం రెచ్చగొట్టేందుకు యత్నించారని పాత్రికేయుడు, రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్నాబ్ గోస్వామి కి వ్యతిరేకంగా కేసు నమోదైంది. నల్ బజార్కు చెందిన రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు పోలీస్ ఉన్న తాధికారులు తెలిపారు. బాంద్రాలోని ఒక మసీదు లక్ష్యంగా ముస్లింలపై అర్నాబ్, అతడి చానల్ ద్వారా విద్వేషం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇర్ఫాన్ ఆరోపించారు. గత నెల 14న బాంద్రాలో జరిగిన వలస కార్మికుల నిరసనకు, ఈ మసీదుకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని తప్పబట్టారు. బాంద్రాకు చేరుకున్న వందలాది మంది వలస కూలీలు మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలానికి చేరుకున్నారు. కానీఆర్నాబ్ మాత్రం మత ఘర్షణలకు ఆ మసీదు యత్నిస్తోందని మీడియాలో ప్రసారమైన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారని విమర్శించారు. ‘లాక్డౌన్ సమయంలో మసీదులో జనం ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు? ఇది మత విద్వేష చర్యే’నన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos