హెచ్-1బీ వీసాలను రద్దు అసమంజసం

హెచ్-1బీ వీసాలను రద్దు అసమంజసం

వాషింగ్టన్: కరోనా వల్ల అమెరికాలో నిరుద్యోగ సమస్య తీవ్రమైనందున అమెరికా హెచ్-1బీ వీసాల్ని తాత్కాలికంగా రద్దు చేయదలచటం సరి కాదని గూగుల్ ముఖ్య కార్యానిర్వహణాధికారి సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక రంగ పురోగతిలో వలస వాసుల పాత్రం ఎంతో గానో ఉందని చెప్పారు. వారి వల్లే అమెరికా సాంకేతికంగా ప్రపంచ నేతగా అవతరించిందన్నారు. ‘గూగుల్ ఇప్పుడు గొప్ప స్థానంలో ఉందంటే అది కూడా వలస వాసుల వల్లే. ట్రంప్ ప్రకటన తమను నిరుత్సాహపరిచింది. అయినా మేము వలస వాసుల్ని ప్రోత్స హిస్తూనే ఉంటాం. అందరికీ అవకాశాలు కల్పిస్తూనే ఉంటామ’ని ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos