గోలీ మార్‌ మంత్రి, గో బ్యాక్

గోలీ మార్‌ మంత్రి, గో బ్యాక్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్సభలో మాట్లాడేందుకు నిలబడిన ప్రతిసారీ ‘గోలీ మంత్రి. గో బ్యాక్.’అని ప్రతిపక్ష సభ్యులు నిరసించారు. ‘కాల్పులు ఆపండి’ అని డిమాండ్ చేశారు. దీంతో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్ప టం మంత్రికి ఇబ్బందిగా మారింది. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు దేశ ద్రోహులనీ.. వారిని కాల్చి పారేయాలంటూ ఠాకూర్ పేర్కొన్నా రు. ‘‘దేశ్ కే గద్దారోంకో’’ అంటూ మంత్రి నినాదం ఇవ్వగానే.. అక్కడ ఉన్న జనం అంతా ‘‘గోలీ మారో’’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటంతో ఆయన ప్రచారాన్ని మూడు రోజుల పాటు నిషేధించింది. ఠాకూర్ వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి ఇప్పటికి మూడు సార్లు సీఏఏ నిరసన కారులపై కాల్పులు జరగడం కలకలం రేపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos