11 కిలోల బంగారం స్వాధీనం

11 కిలోల బంగారం స్వాధీనం

ముంబై: ఇక్కడి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసు కున్నారు. మొత్తం 24 కేసుల్లో 11.40 కిలోల బంగారం పట్టు బడింది. వీటితోపాటు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం, వస్తువుల విలువ రూ.7.46 కోట్లుగా అంచనా. బట్టలు, శానిటరీ ప్యాడ్స్, ట్రాలీ, లోదుస్తులు వంటి ఇతర ప్రదేశాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos