చర్చల్లో కశ్మీర్ ప్రస్తావనే లేదు

చర్చల్లో కశ్మీర్ ప్రస్తావనే లేదు

చెన్నై:భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా దేశాధినేత షీ జిన్ పింగ్ మధ్య జరిగిన చర్చల్లో కశ్మీర్ అంశం మాత్రం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శనివారం మహాబలి పురంలో తెలిపారు. దాదాపు 90 నిమిషాల పాటు అనేక కీలక అంశాల గురించి చర్చిం చారన్నారు. పెరుగుతున్న తీవ్రవాదం రెండు దేశాలకు మంచిది కాదని ఇద్దరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తీకరించారని గోఖలే చెప్పారు. వాణిజ్య, పర్యా టక రంగం తదితర అంశాలు చర్చకు వచ్చాయన్నారు. వారి చర్చల తర్వాత రెండు దేశాల ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయని వివరిం చారు. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శనివారం చెన్నై నుంచి నేపాల్కు బయల్దేరి వెళ్లారు. ఆయనకు విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, సీఎం పళనిస్వామి వీడ్కోలు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos